TS politics: మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దు: రేవంత్‌రెడ్డి - telugu news congress leaders meets in indirabhavan
close
Published : 05/08/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS politics: మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: పార్టీకి వ్యతిరేకంగా తనతో సహా ఎవరు పనిచేసినా చర్యలుంటాయని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవద్దని హితవు పలికారు. బాధ్యతాయుతంగా పార్టీలో పనిచేస్తేనే గౌరవం పెరుగుతుందన్నారు. హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.  సెప్టెంబరు మొదటి వారంలో తెలంగాణకు రాహుల్‌ గాంధీ వచ్చే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు.  ప్రాంతం, తేదీ, ఎక్కడ.. ఎప్పుడు అనేది మనమే నిర్ణయించాలని పేర్కొన్నారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని తీసుకున్నామని తెలిపారు. దళిత దండోరా కార్యక్రమంపై  రాహుల్‌గాంధీతో చర్చించామని, ఆయన కూడా పాల్గొంటారని వెల్లడించారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు ఐదు మండలాలు, రెండు మున్సిపాలిటీలు తీసుకొని ప్రతి రోజూ ఒక ప్రాంతంలో రెండు..మూడు వేల మందితో ర్యాలీలు నిర్వహించాలన్నారు.

మండలంలో ఉన్న ఓటర్లలో పదిశాతం మంది సమావేశానికి వచ్చేలా ప్రణాళిక చేయాలని రేవంత్‌ సూచించారు. కాంగ్రెస్‌ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలన్నారు. అనుబంధ సంఘాల నాయకులతో క్షేత్రస్థాయిలో పనిచేయించాలని తెలిపారు. హుజూరాబాద్‌ అభ్యర్థి విషయంలో సామాజికవర్గం, కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసే వారు కావాలన్నారు. అభ్యర్థి ఎంపికపై పొన్నం ప్రభాకర్‌, దామోదర రాజనర్సింహ కలిసి సిఫారసు చేయాలని రేవంత్‌ సూచించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని