Ts Congress: కాంగ్రెస్‌ నిరసనల్లో పోలీసుల అత్యుత్సాహం: మధుయాష్కీ - telugu-news-congress political affairs committee meeting in gandhi bhavan
close
Updated : 25/07/2021 05:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts Congress: కాంగ్రెస్‌ నిరసనల్లో పోలీసుల అత్యుత్సాహం: మధుయాష్కీ

హైదరాబాద్‌: కోకాపేట భూముల అవినీతిపై పోరాడేందుకు తదుపరి కార్యాచరణ రూపొందించాలని.. రాష్ట్రంలో ఇకపై తెరాస చేసే అవినీతిపై పోరాటం కొనసాగించాలని కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ తీర్మానించింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. మధుయాష్కీ మాట్లాడుతూ.. కోకాపేట భూములపై జరిగిన అవినీతి గురించి ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాకు వివరిస్తామన్నారు. పోడు భూములు లాక్కోవడాన్ని అరికట్టేందుకు కమిటీ వేసినట్లు చెప్పారు. 

ఎస్టీ ప్రతినిధులతో ఏర్పాటు చేసే కమిటీ ద్వారా పోడు భూముల రక్షణ కోసం కార్యచరణ రూపొందిస్తామన్నారు.‘‘ప్రజాసమస్యలపై కాంగ్రెస్ చేసే నిరసనల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పోలీసుల తీరుపై డీజీపీకి, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేస్తాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. ఏడేళ్ల  కాలంలో ఎస్సీ, ఎస్టీలను రాష్ట్ర ప్రభుత్వం వంచనకు గురి చేసింది. ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు చేసిన నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. త్వరలోనే దళిత, గిరిజన, బీసీ దండోరా చేపడతాం. ఆగష్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత దండోరా కార్యక్రమాన్ని చేపడతాం. దళిత బంధు పేరుతో చేస్తున్న మోసాలను బయట పెడతాం. వరదల వల్ల నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి. జీహెచ్ఎంసీ వరదల్లో గత ఏడాది నష్టపోయిన వారికి ఇప్పటికీ వరద సాయం ఇవ్వలేదు’’ అని తెలిపారు.

బలవంతంగా లాక్కున్నారు: జగ్గారెడ్డి
‘‘రాష్ట్ర వ్యాప్తంగా విలువైన అసైన్డ్‌ భూములు ఉన్నాయి. రైతుల వద్ద ఉన్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. 
రైతులు కలెక్టర్లకు ఫిర్యాదు చేద్దామంటే.. వాళ్లు ప్రైవేట్ ఫాంహౌస్‌లో ఉంటున్నారు. సదాశివపేటలో 5వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించాం. అక్కడి నుంచి పేదలను తరిమికొట్టి ఆ భూములను విక్రయించాలని యత్నిస్తున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలో పేదలకు ఇచ్చిన 200 ఎకరాలను ప్రభుత్వం బలవంతంగా లాక్కొంది. తెరాస నేతలందరూ ఆ అసైన్డ్ భూములను కొన్నారు. అసైన్డ్ భూములను కాపాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తొందర్లోనే కార్యాచరణ చేపడతాం’’ అని అన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని