Covid Vaccine: అతి త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకా! - telugu news covid‌ vaccine for children very soon
close
Updated : 28/07/2021 12:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Vaccine: అతి త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకా!

దిల్లీ: పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ అతి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మంగళవారం తెలిపారు. ఈ మేరకు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన వెల్లడించారు. దేశంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా సాగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 18, అంతకన్నా ఎక్కువ వయసున్న వారికే కొవిడ్‌ టీకాలు వేస్తున్నారు. కాగా 12-18 ఏళ్ల వారికి జులై ఆఖరు లేదా ఆగస్టులో వ్యాక్సినేషన్‌ ప్రారంభం కావచ్చని ఇటీవల కొవిడ్‌-19 జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.ఆరోడా తెలిపిన సంగతి తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని