అప్పుడు గ్రూప్‌లో ఒకడిని.. ఇప్పుడు ఒక్కడిని  - telugu news dance master jani about shankar and ram charan combo film
close
Published : 18/07/2021 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పుడు గ్రూప్‌లో ఒకడిని.. ఇప్పుడు ఒక్కడిని 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక్కో మెట్టు ఎక్కుతూ అనుకున్న గమ్యం చేరితే ఆ ఆనందమే వేరు. ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ ఇదే అంటున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించనున్న చిత్రానికి ఆయన ప్రధాన కొరియోగ్రాఫర్‌గా ఎంపికవడమే ఆయన సంతోషానికి కారణం. ప్రభుదేవాతో శంకర్‌ తెరకెక్కించిన ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ముక్కాబులా’ పాటతోనే స్టేజీ పర్ఫామర్‌గా డ్యాన్స్‌ ప్రస్థానాన్ని ప్రారంభించారు జానీ. ఆ తర్వాత శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్‌’ సినిమాలోని ఓ పాటకి 500 మందికిపైగా ఉన్న బృందంలో ఒకడిగా స్టెప్పులేశారు. అలాంటి తనకి భారీ ప్రాజెక్టులో మెయిన్‌ కొరియోగ్రాఫర్‌గా అవకాశం రావడంతో సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు జానీ. ‘శంకర్‌ సర్‌ చిత్రంలోని ముక్కాబులా పాటతో స్టేజ్‌ పర్ఫామర్‌గా మారాను. బాయ్స్‌లోని ఓ పాటకి 500 మందితో కలిసి డ్యాన్సు చేశాను. అలాంటి నన్ను ‘ఆర్‌సీ 15’ (వర్కింగ్‌ టైటిల్‌)కి కొరియోగ్రాఫర్‌గా ఎంపిక చేసినందుకు శంకర్‌ సర్‌కి, నా అభిమాన నటుడు రామ్‌ చరణ్‌, నిర్మాత దిల్‌రాజ్‌ గారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 

గతంలో రామ్‌ చరణ్‌ నటించిన ‘రచ్చ’లోని ‘డిల్లకు డిల్లకు’, ‘నాయక్‌’లోని ‘లైలా ఓ లైలా’, ‘శుభలేఖ రాసుకున్న’, ‘ఎవడు’లోని ‘ఫ్రీడమ్‌’, ‘బ్రూస్‌లీ’లోని టైటిల్‌ ట్రాక్‌, ‘రన్‌’, ‘రంగస్థలం’లోని ‘జిగేలి రాణి’ పాటలకు నృత్య రీతులు సమకూర్చారు జానీ. అవన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని