ts politics: కొవిడ్‌ మరణాల్లో తేడా.. బాధితులకు ద్రోహం చేయడమే! - telugu news dasoju sravan letter to ts cs
close
Published : 24/07/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ts politics: కొవిడ్‌ మరణాల్లో తేడా.. బాధితులకు ద్రోహం చేయడమే!

హైదరాబాద్‌: కొవిడ్‌ మరణాలపై వాస్తవాలను వెలికితీసేందుకు డెత్‌ రిపోర్టు ఆడిట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కొవిడ్‌ మరణాలను తక్కువ చేసి చూపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఆయన లేఖ రాశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు.. కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్న పరిహారానికి అర్హులయ్యేందుకు వీలుగా కొవిడ్‌ మరణాల లెక్కలు సరి చేయాలని విజ్ఞప్తి చేశారు. 

మొత్తం ఏడాదిన్నర కాలంలో 3,715 చావులే అని చెప్పడం పచ్చి అబద్ధమని, అలా చెప్పడం నేరమని లేఖలో పేర్కొన్నారు. దాదాపు లక్షన్నర మంది చనిపోతే.. కేవలం 3,715 మంది మాత్రమే చనిపోయినట్టు చూపడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి అబద్ధాల కోరులని విమర్శించారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. తప్పుడు లెక్కలు చూపి అంతా బాగున్నట్టు భ్రమలు కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుడు లెక్కలు చూపిన ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. మనుషుల ప్రాణాలు కాపాడడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం చావుల్లో కూడా అబద్ధపు లెక్కలు చూపి బాధిత కుటుంబాలకు ద్రోహం చేస్తోందని విమర్శించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని