Deepika Padukone: దీపికా- రణ్‌వీర్‌ కొత్తింటి ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..! - telugu news deepika padukone ranveer singh buy a lavish building
close
Published : 16/09/2021 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Deepika Padukone: దీపికా- రణ్‌వీర్‌ కొత్తింటి ధర తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ముంబయి: బాలీవుడ్‌ రియల్‌లైఫ్‌ జోడీ రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ ఇంటి ధరే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. తమ వివాహం అయినప్పటి నుంచి రణ్‌వీర్‌- దీపికా ప్రభాదేవి అనే ప్రాంతంలో ఉంటున్నారు. విలాసవంతమైన భవనంలో 26వ అంతస్తులో జీవనం గడుపుతున్నారు. అయితే, ఆలీబాగ్‌ ప్రాంతంలోని కిహిమా బీచ్‌కి దగ్గర్లో ఉన్న ఓ భవంతిపై వారు మనసుపారేసుకున్నారట. సువిశాల, అధునాతనమైన ఈ బంగ్లా కోసం సుమారు రూ. 22 కోట్లు వెచ్చించారని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్‌ కోసమే దాదాపు రూ. 1.32 కోట్లు చెల్లించారట. 2.25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇల్లు 5 బెడ్‌ రూములు కలిగి ఉందని సమాచారం. ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘83’ చిత్రం త్వరలోనే సందడి చేయనుంది. టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా ఈ సినిమా రూపొందింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని