AP NEWS: హైకోర్టులో దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌ - telugu news devineni uma bail petetion in ap high court
close
Published : 29/07/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP NEWS: హైకోర్టులో దేవినేని ఉమా బెయిల్‌ పిటిషన్‌

అమరావతి: మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీసులు తనపై  హత్యాయత్నం, కుట్ర, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు అన్యాయంగా పెట్టారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వ్యాజ్యంలో పేర్కొన్నారు. కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. పిటిషనర్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. 

ఉమా కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఫోన్‌..

మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ అక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకే కక్షపూరితంగా ఉమాను అరెస్టు చేశారని మండిపడ్డారు. పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉమా రాత్రింబవళ్లు పనిచేశారని, జైలు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కుటుంబ సభ్యులకు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని