Shakunthalam: ‘శాకుంతలం’ సెట్‌లో సెలబ్రేషన్స్‌.. టీమ్‌కి బై చెప్పిన హీరో - telugu news devmohan wraps shakunthalam shoot
close
Updated : 24/08/2021 18:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shakunthalam: ‘శాకుంతలం’ సెట్‌లో సెలబ్రేషన్స్‌.. టీమ్‌కి బై చెప్పిన హీరో

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న రమణీయ ప్రేమకావ్యం ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా చేసుకుని ఈ ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత ‘శాకుంతల’గా ప్రధాన పాత్ర పోషించారు. ఆమెకు జోడీగా ‘దుష్యంతుడి’ పాత్రలో మలయాళీ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. కాగా, తాజాగా దేవ్‌ మోహన్‌ పార్ట్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ మేరకు చిత్రబృందం సెట్‌లో సెలబ్రేషన్స్‌ నిర్వహించింది. ‘థ్యాంక్స్ దుష్యంత్‌’ పేరుతో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసి దేవ్‌మోహన్‌కు వీడ్కోలు చెప్పింది. అనంతరం దేవ్‌మోహన్‌ ‘శాకుంతలం’ టీమ్‌కు బై చెప్పారు. పాన్‌ ఇండియా మూవీగా ‘శాకుంతలం’ సిద్ధమవుతోంది. అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేయనున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని