dhee 13 kings vs queens: బుల్లితెరపై ‘లాహే లాహే’, రజనీకాంత్‌ హంగామా! - telugu news dhee 13 kings vs queens latest promo sudheer adhi priyamani pradeep
close
Published : 22/07/2021 18:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

dhee 13 kings vs queens: బుల్లితెరపై ‘లాహే లాహే’, రజనీకాంత్‌ హంగామా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: డ్యాన్సులతో పాటు నవ్వులు పంచే కార్యక్రమం ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’. ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమవుతున్న ఈ షోకి ప్రదీప్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తదుపరి ఎపిసోడ్‌కి సంబంధించి ‘కొరియోగ్రాఫర్‌ విత్‌ కంటెస్టెంట్‌’ రౌండ్‌ని రూపొందించారు. తాజాగా ప్రోమో విడుదలై, అలరిస్తోంది. క్వీన్స్‌ టీం ప్రదర్శించిన ‘ఆచార్య’ చిత్రంలోని ‘లాహే లాహే’ పాట కనుల పండగలా సాగింది. అధిక సంఖ్యలో డ్యాన్సర్లు కనిపించి ఆకట్టుకున్నారు. న్యాయనిర్ణేతల్ని ఫిదా చేశారు. ఈ ప్రోమోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీం లీడర్లు సుధీర్‌, ఆది, రష్మి, దీపికా సైతం ఈ పాటకి కాలు కదిపారు. ఈ పాటతోపాటు ‘సామజవరగమన’, ‘రారా సరసకు రారా’ గీతాలకి నర్తించిన ఆయా కంటెస్టెంట్లు, కొరియోగ్రాఫర్లు మెప్పించారు. రజనీకాంత్‌గా చలాకీ చంటి ఇచ్చిన సడెన్‌ సర్‌ప్రైజ్‌ వావ్‌ అనిపిస్తుంది. ‘అతిగా ఆశపడే మగవాడు.. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు’ అని డైలాగ్‌ చెప్పి క్లాప్స్‌ కొట్టించారు. రజనీకాంత్‌ ‘బాబా’ చిత్ర లుక్‌లో దర్శనమిచ్చి సందడి చేశారాయన. మరి ఈ హంగామా అంతా చూడాలంటే జులై 28 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమోతో ఆనందించండి.. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని