Dhee 13: పూర్ణ మనసు దోచిన అభి.. ఆటో డ్రైవర్‌గా ప్రదీప్‌ - telugu news dhee kings vs queens latest promo
close
Published : 30/07/2021 18:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dhee 13: పూర్ణ మనసు దోచిన అభి.. ఆటో డ్రైవర్‌గా ప్రదీప్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణ భారతదేశంలో అతి పెద్ద డ్యాన్స్‌ రియాలిటీ షోగా పేరొందింది ‘ఢీ’. 12 సీజన్స్‌ ముగించుకుని ఇప్పుడు ‘ఢీ 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’గా మనముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతుంది. ఈ వారం ‘కొరియోగ్రాఫర్‌ విత్‌ కంటెస్టెంట్‌’ ఛాప్టర్‌ 1తో వేడెక్కింది ఈ షో. అదే జోరుతో ‘ఛాప్టర్‌ 2’కి సిద్ధమైంది. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఓ వైపు డ్యాన్సర్ల స్టెప్పులతో.. మరోవైపు ఆది, సుధీర్‌, ప్రదీప్‌ కామెడీతో ఆద్యంతం అలరిస్తుంది. మునుపటి ఎపిసోడ్‌కి మించిన ఉత్కంఠ ఈ ఎపిసోడ్‌లో ఉండబోతుందని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ‘చిన్ని తండ్రీ నిను చూడగా’ అనే పాటకు చిన్నపిల్లాడిగా మారిపోయి అభి చేసిన పర్ఫామెన్స్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. తన ప్రతిభని మెచ్చి న్యాయ నిర్ణేతల్లో ఒకరైన పూర్ణ అభిని ముద్దుకోవడంతో షోలో సందడి నెలకొంది. అభి హావభావాలకు టీం లీడర్లూ ఫిదా అయిపోయారు. ‘సామజవరగమన’ పాటకి మరో కంటెస్టెంట్‌ తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి మెప్పించాడు.

మధ్యలో ఆటో డ్రైవర్‌గా సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు ప్రదీప్‌. ప్రయాణికులుగా ఆది, సుధీర్‌ హంగామా చేశారు. ‘ఏమయ్యా! ఆటో వస్తుందా?’ అని సుధీర్‌ అడగ్గా ‘పిలిచి చూడు వస్తుందేమో’ అంటూ ప్రదీప్‌ పంచ్‌ విసిరి అలరిస్తున్నాడు. ఇంతకీ ఈ ఆటో డ్రైవర్‌కి డ్రైవింగ్‌ రాదండోయ్‌. ఏదో అలా మేనేజ్‌ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఎన్నో నవ్వులు పూయించాడు. మరి ఈ వినోదాన్ని ఆస్వాదించాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ప్రోమోతో ఆనందించండి.. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని