DiaMirza: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి - telugu-news-dia mirza and vaibhav welcomes a baby boy
close
Published : 15/07/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

DiaMirza: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి

ముంబయి: ఒకప్పటి అందాల సుందరి, బీటౌన్‌ నటి దియామీర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.  బుధవారం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మే 14న బిడ్డకు జన్మనిచ్చా. అనుకోని పరిస్థితుల రీత్యా నెలలు నిండకుండానే నేను బాబుకి జన్మినివ్వాల్సి వచ్చింది. అవ్యాన్‌ ఆజాద్‌ రాఖీ.. వీడే మా గుండెచప్పుడు. ప్రస్తుతం బాబు, నేనూ ఆరోగ్యంగా ఉన్నాం. నేను, నా భర్త వైభవ్‌ ప్రస్తుతం పొందుతున్న ఆనందానికి అవధుల్లేవ్‌. మమ్మల్ని సంరక్షించిన వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అలాగే మమ్మల్ని ఆదరిస్తున్న అభిమానులకు, వాళ్ల ఆశీస్సులకు ధన్యవాదాలు’ అని దియా మీర్జా ప్రకటించారు.

‘ఎన్‌ శ్వాస కాత్రే’ అనే తమిళ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన దియామీర్జా అనంతరం బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వైల్డ్‌ డాగ్‌’లో దియా మీర్జా కీలకపాత్ర పోషించారు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే.. 2014లో సహిల్‌ సంఘా అనే వ్యాపారవేత్తతో ఏడడుగులు వేసిన దియా మీర్జా 2019లో ఆయన నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం వైభవ్‌ రాఖీ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని