Dilraju: విజయ్‌దేవరకొండ.. మరో పవన్‌కల్యాణ్‌: దిల్‌రాజు - telugu news dilraju speech at rowdy boys song release event goes viral in social media
close
Updated : 21/10/2021 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dilraju: విజయ్‌దేవరకొండ.. మరో పవన్‌కల్యాణ్‌: దిల్‌రాజు

వైరల్‌గా మారిన దిల్‌రాజు కామెంట్స్‌

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ రూపంలో సినీ పరిశ్రమకు మరో యూత్‌ఫుల్‌ హీరో దొరికాడని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. తన కుటుంబానికి చెందిన ఆశిష్‌ హీరోగా తెరకెక్కిన ‘రౌడీ బాయ్స్‌’లోని రెండో సాంగ్‌ విడుదల కార్యక్రమంలో దిల్‌ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కాగా, ఈవెంట్‌లో భాగంగా దిల్‌రాజు మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ తనకు ఎంతో కాలం నుంచి తెలుసని అన్నారు.

‘‘యూత్‌ఫుల్‌ కథాంశంతో ‘రౌడీ బాయ్స్‌’ చిత్రాన్ని తెరకెక్కించాం. కథకు అనుగుణంగానే ఈ చిత్రానికి ‘రౌడీ బాయ్స్‌’ అనే టైటిల్‌ పెట్టాం. టైటిల్‌ ఓకే అనుకున్నాక.. విజయ్‌ దేవరకొండ పర్మిషన్‌ తీసుకున్నాను. విజయ్‌ నాకు ఎంతోకాలం నుంచి తెలుసు. మా బ్యానర్‌పై నిర్మితమైన ‘కేరింత’ సినిమా ఆడిషన్స్‌లో భాగంగా విజయ్‌ ఫొటోషూట్‌ కోసం ఓసారి మా ఆఫీస్‌కు వచ్చాడు. ఆ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల్లో ఓ రోల్‌ విజయ్‌ చేయాల్సింది. కానీ కుదరలేదు. ఫొటోషూట్‌కి వచ్చిన సమయంలో విజయ్‌ని దూరం నుంచే చూశాను కలవలేదు. ఆ తర్వాత విజయ్‌ హీరోగా నటించిన ‘పెళ్లి చూపులు’ తెరకెక్కింది. ఆ సినిమా నాకు చూపించి.. మా బ్యానర్‌పై దాన్ని విడుదలచేయాలని విజయ్‌ ఎంతో ట్రై చేశాడు. నన్ను కలవడం కోసం మా ఆఫీస్‌కు వచ్చాడు. అప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. అలా, ‘పెళ్లి చూపులు’ నేను రిలీజ్‌ చేయలేకపోయాను. ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి’, ‘గీతగోవిందం’ చిత్రాలతో విజయ్ స్టార్‌గా మారాడు. ‘గీతగోవిందం’ సక్సెస్‌ ఈవెంట్‌కి నేను అతిథిగా వెళ్లాను. అక్కడ విజయ్‌కి ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్‌ చూశాను. అతి తక్కువ కాలంలో మూడు నాలుగు సినిమాలతోనే అప్పట్లో పవన్ కల్యాణ్‌కు యూత్‌లో ఎంత క్రేజ్ వచ్చిందో ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వంటి సినిమాలతో విజయ్ దేవరకొండకు అంత క్రేజ్‌ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీకి ఓ యూత్‌ఫుల్‌ స్టార్‌, మరో పవన్‌కల్యాణ్‌లా విజయ్‌ దొరికాడు. ‘లైగర్‌’తో పాన్‌ ఇండియా హీరోగా పరిచయం అవుతున్న విజయ్‌కి నా అభినందనలు’’ అని దిల్‌రాజు వ్యాఖ్యానించారు. అయితే, దిల్‌రాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దిల్‌రాజు కామెంట్స్‌ పట్ల విజయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని