Suriya: 18 ఏళ్ల తర్వాత.. ‘శివపుత్రుడు’ కాంబినేషన్‌ రిపీట్‌! - telugu news director bala and actor suriya combo repeat
close
Published : 28/10/2021 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Suriya: 18 ఏళ్ల తర్వాత.. ‘శివపుత్రుడు’ కాంబినేషన్‌ రిపీట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్య, విక్రమ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాలా తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పితామగన్‌’. 2003లో విడుదలైన ఈ సినిమా తమిళనాట సంచలనం సృష్టించింది. తెలుగులో ‘శివ పుత్రుడు’ పేరుతో విడుదలై ఘన విజయం అందుకుంది. దాంతో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో ఈ కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఏర్పడింది. సూర్య, విక్రమ్‌తో బాలా మళ్లీ ఎప్పుడు సినిమా తీస్తారా? అనే ఎదురుచూపులకు తెరపడింది. సూర్య- బాలా కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. సుమారు 18 ఏళ్ల తర్వాత మరో విభిన్న కథతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. 


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని