DOST: ముగిసిన మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు - telugu-news-dost degree online admissions
close
Published : 23/07/2021 22:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

DOST: ముగిసిన మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు

హైదరాబాద్‌: డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాలకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది. నిన్న సాయంత్రం వరకు 1,77,485 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వారిలో 1,39,076 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆధార్ అనుసంధాన మొబైల్ ద్వారా లేదా.. మీసేవ కేంద్రాలు, టీఎస్ ఫోలియో యాప్‌ పాటు 105 సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని లింబాద్రి తెలిపారు. ఈనెల 31న డిగ్రీ మొదటి విడత సీట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నారు. రెండో విడత రిజిస్ట్రేషన్లు ఆగస్టు 1 నుంచి 9 వరకు... వెబ్ ఆప్షన్ల గడువు ఆగస్టు 2 నుంచి 9 వరకు ఉంటుందన్నారు. ఆగస్టు 14న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని