Vaccine: అప్పుడు 85 రోజులు..ఇప్పుడు 24 రోజులే.. - telugu news due to vaccine for all free vaccine campaign in 24 days coverage touched 30 to 40 cr
close
Published : 19/07/2021 23:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: అప్పుడు 85 రోజులు..ఇప్పుడు 24 రోజులే..

దిల్లీ: సవరించిన టీకా విధానం అమల్లోకి వచ్చిన 24 రోజుల్లో కేంద్రం మరో 10 కోట్ల మందికి టీకాలు వేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. టీకా కార్యక్రమ ప్రారంభంలో మొదటి పది కోట్ల డోసులు వేయడానికి 85 రోజులు పట్టిందని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘భారత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన టీకా కార్యక్రమం ప్రధాని మోదీ నాయకత్వంలో నిరాటంకంగా సాగుతోంది. మైలురాళ్లను దాటుతోంది. టీకా కార్యక్రమ ప్రారంభంలో 10 కోట్ల డోసుల పంపిణీకి 85 రోజులు పట్టింది. సవరించిన టీకా విధానంతో 30 కోట్ల నుంచి 40 కోట్లకు చేరుకోవడానికి 24 రోజులు మాత్రమే అవసరమయ్యాయి’ అని మన్‌సుఖ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. 

కరోనా కట్టడికి కేంద్రం జనవరి 16న టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే 18 ఏళ్లుపైబడిన ప్రతిఒక్కరికి ఉచితంగా టీకాలు వేయాలనే లక్ష్యంతో కొత్త టీకా విధానాన్ని జూన్ 21 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రమే ఉచితంగా టీకా డోసులు అందజేస్తోంది. అందుకోసం టీకా ఉత్పత్తిలో 75 శాతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుండగా.. 25 శాతం డోసుల్ని ప్రైవేటు ఆసుపత్రులు సేకరిస్తున్నాయి. 

ఇక ఈ రోజు ఉదయం ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 40.64 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న కేవలం 13.63లక్షల మందే టీకా వేయించుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని