Tokyo Olympics: క్రీడాగ్రామంలో ఒకపక్క ఆటలు.. మరోపక్క కొవిడ్‌ కేసులు - telugu news dutch tennis player tests positive for covid organisers announce 16 new cases at tokyo olympics
close
Published : 26/07/2021 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: క్రీడాగ్రామంలో ఒకపక్క ఆటలు.. మరోపక్క కొవిడ్‌ కేసులు

టోక్యో: ఒలింపిక్‌ క్రీడా గ్రామంలో ఒక పక్క ఆటలు సాగుతుండగా మరోపక్క కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా డచ్‌ టెన్నిస్‌ ఆటగాడు జీన్‌ జూలియన్‌ రోజర్‌కు కొవిడ్‌ సోకింది. ఫలితంగా అతడు క్రీడల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. సోమవారం 16 కొత్త కేసులు రావడం గమనార్హం.

రోజర్‌ అతడి డబుల్స్‌ భాగస్వామి వెస్లీ కూలుఫ్‌ న్యూజిలాండ్‌ ద్వయం మార్కస్‌ డానియల్‌, మైకేల్‌ వీనస్‌తో తలపడాల్సి ఉంది. పాజిటివ్‌ ఫలితం రావడంతో రెండో రౌండ్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

‘జీన్‌ పాల్‌ రోజర్‌కు పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని నెదర్లాండ్స్‌ ఒలింపిక్‌ కమిటీ, ఆ దేశ క్రీడా సమాఖ్యకు ఐటీఎఫ్‌ తెలియజేసింది. పురుషుల డబుల్స్‌ పోటీల నుంచి రోజర్‌, కూలుఫ్‌ జోడీ తప్పుకున్నారు. వారితో తలపడాల్సిన కివీస్‌ జోడీ వాకోవర్‌ రూపంలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. రోజర్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’ అని టెన్నిస్‌ పాలక కమిటీ తెలిపింది.

సోమవారం ముగ్గురు అథ్లెట్లు, నలుగురు కాంట్రాక్టర్లు, ఎనిమిది మంది సహాయ సిబ్బంది, ఒక ఉద్యోగికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్వాహకులు ప్రకటించారు. కొవిడ్‌ సోకిన అథ్లెట్లు క్రీడా గ్రామంలో ఉండటం లేదు. చెక్‌ రిపబ్లిక్‌ క్రీడా బృందంలో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడటం గమనార్హం.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని