Bollywood: విలన్‌ కోసం భారీ వ్యయం - telugu news emraan hashmi entry sequence to cost in crores
close
Published : 26/07/2021 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: విలన్‌ కోసం భారీ వ్యయం

ముంబయి: హీరో ఎంట్రీ సీన్‌ కోసం రూ.కోట్లు సహజంగానే ఖర్చు  చేస్తుంటారు. ఎందుకంటే అభిమానులు అంతలా ఎదురుచూస్తుంటారు. తమ హీరో ఎంట్రీ అదిరిపోవాలని కోరుకుంటారు. ఇక్కడ విలన్‌ ఎంట్రీ సీన్‌ కోసం భారీగా ఖర్చుపెడుతున్నారు. సల్మాన్‌ఖాన్‌ నుంచి వస్తున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘టైగర్‌ 3’. ఇందులో ఇమ్రాన్‌హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆయన పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్‌గా నటిస్తున్నట్టు  సమాచారం. సల్మాన్‌కు దీటుగా ఉండేందుకు భారీగా కండలు పెంచే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమ్రాన్‌ ఎంట్రీ సీన్‌ కీలకంగా ఉండనుందట. అందుకే ఈ సన్నివేశం కోసం సుమారు రూ.10కోట్లు ఖర్చుపెట్టనున్నట్టు తెలుస్తోంది. మనీష్‌శర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కత్రినాకైఫ్‌ నాయికగా నటిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని