T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌లో అదే మా బలం: ఇయాన్‌ మోర్గాన్ - telugu news england captain eoin morgan says their biggest strength is continous performance
close
Published : 20/08/2021 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

T20 World Cup: పొట్టి ప్రపంచకప్‌లో అదే మా బలం: ఇయాన్‌ మోర్గాన్

లండన్‌: గడిచిన రెండేళ్లలో తాము నిలకడగా ఆడుతున్నామని, రాబోయే టీ20 ప్రపంచకప్‌లోనూ అదే తమ బలమని ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. 2016లో చివరిసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్లో బెన్‌స్టోక్స్‌ వేసిన చివరి ఓవర్‌లో విండీస్‌ బ్యాట్స్‌మన్‌ బ్రాత్‌వైట్‌ అనూహ్యంగా నాలుగు సిక్సర్లు సంధించి ఆ జట్టును విజేతగా నిలిపాడు. దాంతో ఇంగ్లాండ్‌ త్రుటిలో పొట్టి ప్రపంచకప్‌ను కోల్పోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో మాత్రం మోర్గాన్‌ టీమ్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే తాము రెండేళ్లుగా నిలకడగా ఆడుతున్నామని, ఆ విజయ పరంపరను కొనసాగిస్తామని చెప్పాడు.

‘‘గత రెండేళ్లుగా మేం నిలకడగా రాణిస్తున్నాం. అదే రాబోయే ప్రపంచకప్‌లో మా జట్టు సానుకూలత. పొట్టి క్రికెట్‌లో ఆట అనేది చాలా త్వరగా మారిపోతుంది. దాంతో పాటు మా గ్రూప్‌ (ప్రపంచకప్‌)లో ఎంతో మెరుగైన జట్లు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు మాకు ప్రతి మ్యాచ్‌ ముఖ్యమే. ఇప్పుడైతే మా విజయ పరంపరను బాగానే కొనసాగిస్తున్నాం. మ్యాచ్‌లు ఆడేకొద్దీ మరింత మెరుగవుతామని ఆశిస్తున్నాం. ఇక ఈ టోర్నీ యూఏఈలో జరుగుతుండటంతో మేమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇక టీ20 రాకతో క్రికెట్‌లో అనూహ్య మార్పులొచ్చాయి. పొట్టి ఫార్మాట్‌ ఆట అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది’’ అని మోర్గాన్‌ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్‌ తలపడే గ్రూప్‌ 1లో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్టు ఉన్నాయి. అక్టోబర్‌ 23న ఆ జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ విండీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని