Evaru Meelo Koteeswarulu: రామ్‌ చరణ్‌- ఎన్టీఆర్‌ మధ్యలో రానా..  - telugu news evaru meelo koteeswarulu ntr ram charan rana
close
Published : 24/08/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Evaru Meelo Koteeswarulu: రామ్‌ చరణ్‌- ఎన్టీఆర్‌ మధ్యలో రానా.. 

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర కార్యక్రమం ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వేదికగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కలిసి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న ఈ షోకి తొలి కంటెస్టెంట్‌గా రామ్‌ చరణ్‌ విచ్చేశారు. తొలి ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారమై, ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచింది. అదే జోరుని కొనసాగిస్తూ తదుపరి ఎపిసోడ్‌ సోమవారం వచ్చేసింది. రూ.1,60,000 విలువైన ప్రశ్నతో ప్రారంభమైన తాజా ఎపిసోడ్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఓ ప్రశ్నకు సమాధానం తెలియక లైఫ్‌ లైన్‌ ద్వారా రామ్‌ చరణ్‌.. నటుడు రానాని సంప్రదించారు. చరణ్‌, తారక్‌, రానా.. ఈ ముగ్గురి మధ్య సాగిన సంభాషణ ఆకట్టుకుంది. మరి ఏ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్‌ రానాకి ఫోన్‌ చేశారు..? ఎంత మొత్తం గెలుచుకున్నారు? చూద్దామా. 

9. జూన్‌ 2020లో ఇండియా- చైనా మధ్య వివాదం తలెత్తిన గల్వాన్‌ లోయ ఏ ప్రాంతంలో ఉంది? 

ఎ) లద్దాఖ్‌ బి) హిమాచల్‌ ప్రదేశ్‌ సి) రాజస్థాన్‌ డి) అరుణాచల్‌ ప్రదేశ్‌

సమాధానం: లద్దాఖ్‌.

10. లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌లో లైవ్‌ ఆర్కెస్ట్రాతో ప్రదర్శించిన మొట్ట మొదటి భారతీయ చిత్రం ఏది? 

ఎ) బాహుబలి: ది బిగినింగ్‌  బి) దంగల్‌ సి) 2.0 డి) కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 1

సమాధానం: బాహుబలి.

11. 1971 బంగ్లాదేశ్‌ యుద్ధం సమయంలో మునిగిపోయిన జలాంతర్గామి పి.ఎన్‌.ఎస్‌. ఘాజీ అసలు పేరేంటి? 

ఎ) చెరోకీ బి) హెర్క్యులీస్‌ సి) ఫోర్డ్‌ డి) డియాబ్లో

సమాధానం:  డియాబ్లో.

* ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకే చరణ్ ‘వీడియో కాల్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌’ ఆప్షన్‌ని ఎంపిక చేసుకున్నారు. రానా సరైన సమాధానం చెప్పి చరణ్‌ని గెలిపించారు. 

12. నాలుగు సార్లు  ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సెబాస్టియన్‌ వెట్టెల్‌ 2021 సీజన్‌లో ఏ ఫార్ములా 1 టీమ్‌కి డ్రైవ్‌ చేస్తున్నారు? 

ఎ) రెడ్‌బుల్‌ బి) విలియమ్స్ సి) ఆస్టన్‌ మార్టిన్‌ డి) మెక్‌లారెన్‌

సమాధానం: ఆస్టన్‌ మార్టిన్‌.

13. ఏ పాలకుడి దగ్గర బ్యూసిఫాలస్‌ అనే యుద్ధాశ్వం ఉండేది?

ఎ) అశోక ది గ్రేట్‌  బి) అక్బర్‌ ది గ్రేట్‌ సి)అలెగ్జాండర్‌ ది గ్రేట్‌ డి) ఆల్ఫ్రెడ్‌ ది గ్రేట్‌

సమాధానం: అలెగ్జాండర్‌ ది గ్రేట్‌.

* ఈ ప్రశ్నకు సమాధానం కోసం చరణ్‌ ‘50-50’ లైఫ్‌ని వినియోగించుకున్నారు. సరైన సమాధానం చెప్పి రూ.25,000,00 గెలుచుకున్నారు. దాంతో కర్టెన్‌ రైజర్‌ ముగిసింది. చరణ్ గెలుచుకున్న 25 లక్షలను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు అందజేస్తున్నట్లు ఎన్టీఆర్‌ తెలిపారు.  



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని