Jabardasth: ‘జబర్దస్త్‌’ నటులు.. కన్నీటి వ్యథలు - telugu news extra jabardasth latest promo rashmi sudheer srinu naresh
close
Published : 31/08/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jabardasth: ‘జబర్దస్త్‌’ నటులు.. కన్నీటి వ్యథలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బజర్దస్త్‌’ నటులు సుధీర్‌, శ్రీను, నరేశ్‌.. తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు నవ్వాగదు. అంతగా తమని తాము మలుచుకున్నారు. తమకంటూ ప్రత్యేక ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. అయితే ఇదంతా అంత తేలికగా సాధ్యంకాలేదు. వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు.. నీళ్లతోనే కడుపు నింపుకున్నారు. తెర వెనక వీళ్లు పడిన ఆ కష్టాల్ని కార్తీక్‌, ఇమ్మాన్యుయేల్‌, నూకరాజు ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వేదికగా తెరపైకి తీసుకొచ్చారు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ 350వ ఎపిసోడ్‌కి చేరుకుంది. సెప్టెంబరు 3న ఈ ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

ఓ వైపు ఆనందం, అల్లరి.. మరోవైపు కంటతడి పెట్టించే సన్నివేశాలు ఈ ప్రోమోలో ఉన్నాయి. రాకింగ్‌ రాకేశ్‌, రోహిణి భార్యభర్తలుగా నవ్వులు పంచగా.. జగదేక వీరుడు- అతిలోక సుందరిలా రామ్‌ ప్రసాద్‌- శ్రీను, అమ్రిష్‌ పురిలా సుధీర్‌ దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. బుల్లెట్‌ భాస్కర్‌- వర్ష జోడీ సందడి చేసింది. రాము, కుటుంబ సభ్యులు.. హరికృష్ణ, సతీమణి.. హరి, సోదరి.. సాయి, వాళ్ల నాన్న తళుక్కున మెరిశారు. తన తల్లి ఎంతో కష్టపడి తన తండ్రిని బతికించిందని చెప్పి సాయి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘బజర్దస్త్‌ ఆర్టిస్టుల లైఫ్‌ జర్నీ స్కిట్‌’ పేరుతో నరేశ్‌ తాను ఎదుర్కొన్న అవమానాల్ని చూపించాడు. సుధీర్‌, శ్రీను పడిన కష్టాల్ని కార్తీక్‌, ఇమ్మాన్యుయేల్‌ కళ్లకు కట్టినట్టు చూపించారు. హృదయాన్ని బరువెక్కించారు. మరి సుధీర్‌, శ్రీను ఈ స్కిట్‌పై ఎలా స్పందించారో తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని