Shaakuntalam: ‘శాకుంతలం’లో బాలీవుడ్‌ విలక్షణ నటుడు! - telugu news famous bollywood actor in shaakuntalam
close
Published : 07/08/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shaakuntalam: ‘శాకుంతలం’లో బాలీవుడ్‌ విలక్షణ నటుడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘శాకుంతలం’. మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా రూపొందుతోంది. టైటిల్‌ పాత్రని సమంత పోషిస్తుండగా మలయాళ నటుడు దేవ్‌ మోహన దుష్యంతుడిగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రానున్న ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటుల ఎంపిక ఉందనే విషయం తెలిసిందే. అయితే అధికారికంగా ప్రకటించకపోయినా ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్‌ విలక్షణ నటుడు కబీర్‌ బేడీ నటిస్తున్నట్టు హింట్ ఇచ్చారు నిర్మాత నీలిమ గుణ. తాను రాసిన ‘స్టోరీస్‌ ఐ మస్ట్‌ టెల్‌: ది ఎమోషనల్‌ లైఫ్‌ ఆఫ్‌ ఏన్‌ యాక్టర్‌’ పుస్తకాన్ని నీలిమకు ఇటీవల అందించారు కబీర్‌. ‘థ్యాంక్‌ యు కబీర్‌ సర్‌. మీతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పుస్తకాన్ని చదవకుండా ఉండలేను’ అని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు నీలిమ. దాంతోపాటు ‘శాకుంతలం’ హ్యాష్‌ట్యాగ్‌ జతచేసి, ఈ చిత్రంలో కబీర్‌ నటిస్తున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. హిందీ, తమిళ చిత్రాలతోపాటు ఇటాలియన్‌ చిత్రాల్లోనూ నటించి, మెప్పించారు కబీర్‌.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని