Saidabad: సైదాబాద్‌ ఘటన.. నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్‌ - telugu news filed pil in ts high court on saidabad rape case accused suicide
close
Published : 17/09/2021 11:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Saidabad: సైదాబాద్‌ ఘటన.. నిందితుడి మృతిపై హైకోర్టులో పిల్‌

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు మృతిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్‌ దీన్ని దాఖలు చేశారు. రాజుది కస్టోడియల్‌ మృతిగా అనుమానం ఉందని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీనిపై మధ్యాహ్నం ఒంటిగంటకు హైకోర్టు విచారణ చేపట్టనుంది.

సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన నిందితుడు రాజు గురువారం స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతిచెందాడు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు భారీగా గాలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ఉన్నత న్యాయస్థానంలో పిల్‌ దాఖలు చేశారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని