థర్డ్‌ ఫ్రంట్‌.. పెద్ద టాస్కే: సంజయ్‌ రౌత్‌ - telugu-news-forming consensus on face to take on bjp in 2024 polls a big task: sanjay raut
close
Published : 15/07/2021 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థర్డ్‌ ఫ్రంట్‌.. పెద్ద టాస్కే: సంజయ్‌ రౌత్‌

ముంబయి: థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో భాజపాను ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం పెద్ద వ్యవహారమేనని అభిప్రాయపడ్డారు. ప్రతి పార్టీ తమకు తాము గొప్ప అని భావించడం వల్లే ఈ సమస్య తలెత్తుతుందని చెప్పారు.

‘‘2024 ఎన్నికలకు అందరినీ ఒకేతాటిపైకి తీసుకురావడం పెద్ద టాస్క్‌. భాజపాను ఎదుర్కోవాలంటే ఇందిరా గాంధీ ఎదుర్కొన్న ఓ జయప్రకాశ్‌ నారాయణ్‌, రాజీవ్‌ గాంధీని ఎదుర్కొన్న ఓ వీపీ సింగ్‌, సోనియా- మన్మోహన్‌ను ఎదుర్కొన్న ఓ మోదీ లాంటి వ్యక్తులు కావాలి’’ అని రౌత్‌ అన్నారు. ప్రధాని అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ.. ‘‘శరద్‌ పవార్‌ చాలా కాలంగా జాతీయ నేత. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో గెలుపుతో మమత అయితేనే బెటర్‌ అని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ ఏదైనా మ్యాజిక్‌ చేస్తే దానికి నేను సంతోషిస్తా’’ అని సమాధానమిచ్చారు. రాహుల్‌తో పీకే భేటీని ఆయన వ్యక్తిగత అంశం అని రౌత్‌ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని