AP News: ప్రైవేట్‌ చిట్టీలు, వడ్డీల పేరుతో రూ. 4 కోట్లకు కుచ్చుటోపీ - telugu news fruad worth of 4 crores in prakasam
close
Published : 29/07/2021 08:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: ప్రైవేట్‌ చిట్టీలు, వడ్డీల పేరుతో రూ. 4 కోట్లకు కుచ్చుటోపీ

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రైవేట్‌ చిట్టీలు, వడ్డీల పేరుతో గిద్దలూరుకు చెందిన మాజీ సైనికుడు ఒకరు రూ. 4 కోట్ల మేర వసూలు చేసి మోసగించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కాపురం డీఎస్పీ కిషోర్‌ కుమార్‌ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బేస్తవారపేట మండలం చిన్న ఓబినేనిపల్లె గ్రామానికి చెందిన కొంగలవీటి రమణారెడ్డి గతంలో సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం గిద్దలూరులో నివాసముంటున్నారు. తనకున్న పరిచయాలతో రూ.లక్ష నుంచి రూ.15 లక్షల విలువైన చిట్టీలు నిర్వహించారు. ఈ క్రమంలో నెలవారీ వడ్డీ చెల్లిస్తానంటూ చిట్టీలు వేసినవారు, ఇతర మాజీ సైనికుల వద్ద నగదు తీసుకున్నారు. ఈ క్రమంలోనే క్రికెట్‌ బెట్టింగ్‌, జూదం, వ్యసనాలకు రమణారెడ్డి అలవాటు పడి నగదును విచ్చలవిడిగా ఖర్చుచేశారు. చిట్టీలు కట్టిన వారు, అప్పు ఇచ్చిన వారు అతనిపై ఒత్తిడి తేవడంతో ఈ నెల 6న ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు గిద్దలూరు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మాజీ సైనికుడు రమణారెడ్డి రూ.4 కోట్ల మేర వసూళ్లకు పాల్పడి మోసగించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అతని వద్ద ఉన్న విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణంశెట్టిపల్లె గ్రామ సమీపంలో రమణారెడ్డి ఉన్నట్టు తెలుసుకుని అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో గిద్దలూరు సీఐ ఫిరోజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

రూ.1.37 కోట్లకు ఐపీ...

వేటపాలెం, న్యూస్‌టుడే: రొయ్యల చెరువులు, ఇతర వ్యాపారాలు చేసే నున్నా రోశయ్య అనే వ్యక్తి రూ.1.37 కోట్లకు చీరాల సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో బుధవారం ఐపీ పిటిషన్‌ దాఖలు చేశారు. దాదాపు 30 మందికి తాను బకాయిలున్నట్టు అందులో పేర్కొన్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని