ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుల బారులు - telugu news ganesh nimajjanam continious in tankbund in hyderabad
close
Updated : 20/09/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ట్యాంక్‌బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనాలు.. గణనాథుల బారులు

హైదరాబాద్: మహానగరంలో గణనాథుల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. వేల సంఖ్యలో వినాయక ప్రతిమలు ఉండటంతో పాటు వర్షం కారణంగా నిన్న ప్రారంభమైన నిమజ్జనం ఆలస్యమైంది. దీంతో ఎన్టీఆర్ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌పై గణనాథుడి ప్రతిమలు బారులు తీరాయి. వీటితో పాటు బషీర్‌బాగ్‌, గన్‌ఫౌండ్రీ వైపు కూడా వినాయకుడి ప్రతిమలు నిమజ్జనానికి కదులుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 9, సంజీవయ్య పార్క్ వద్ద 2, జలవిహార్ వద్ద 1 క్రేన్ సాయంతో విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌ వైపు, అంత కంటే తక్కువ ఉన్న వాటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని