GhostBusters: భవిష్యత్తుని రక్షించే ‘ఘోస్ట్‌బస్టర్స్‌’ - telugu news ghostbusters release date announced
close
Published : 24/09/2021 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GhostBusters: భవిష్యత్తుని రక్షించే ‘ఘోస్ట్‌బస్టర్స్‌’

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ‘ఘోస్ట్‌బస్టర్స్‌’ ఫ్రాంఛైజీలో వస్తున్న తాజా చిత్రం ‘ ‘ఘోస్ట్‌బస్టర్స్‌: ఆఫ్టర్‌ లైఫ్‌’. జాసన్‌ రెట్‌మ్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ నవంబరు 19న మనదేశంలో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. ‘గతాన్ని కనుగొను...భవిష్యత్తుని రక్షించు’ అంటూ విడుదల తేదీతో పోస్ట్‌ చేసింది   సోనీ సంస్థ. అతీంద్రియ శక్తుల కథతో  వినోదాత్మకంగా సాగే చిత్రమిది. కరోనా పరిస్థితుల  కారణంగా జులై 2020 నుంచి ఇప్పటివరకూ నాలుగుసార్లు వాయిదా పడుతూ వచ్చిందీ చిత్రం. క్యారీ కూన్‌, మెకెన్నా గ్రేస్‌, ఫిన్‌ ఉల్ఫ్‌హార్డ్‌, పాల్‌ రుడ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని