Cinema News: కడుపుబ్బా నవ్వించేందుకు ‘గల్లీరౌడీ’ సిద్ధం.. రిలీజ్‌ ఎప్పుడంటే..! - telugu news gllu rowdy all set to release in theaters
close
Published : 04/09/2021 14:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: కడుపుబ్బా నవ్వించేందుకు ‘గల్లీరౌడీ’ సిద్ధం.. రిలీజ్‌ ఎప్పుడంటే..!

హైదరాబాద్: హాస్యంతోపాటు ఆలోచింపచేసే కథాంశంతో సినిమాలు తెరకెక్కించడం ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి సొంతం. ఇటీవల ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’తో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెరకెక్కించిన సరికొత్త చిత్రం ‘గల్లీరౌడీ’. సందీప్‌ కిషన్‌ కథానాయకుడు. నేహాశెట్టి కథానాయిక. ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉదయం ‘గల్లీరౌడీ’ రిలీజ్‌ డేట్‌ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని.. కడుపుబ్బా నవ్వుకునేందుకు సిద్ధంగా ఉండమని తెలిపింది.

‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ చిత్రం తర్వాత సందీప్‌-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి కోన వెంకట్‌ రచయితగా వ్యవహరించారు. కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఏంవీవీ సినిమా సంయుక్తంగా దీనిని నిర్మించాయి. బాబీ సింహా, రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిషోర్‌, తదితరులు కీలకపాత్రలు పోషించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని