వలస జీవితాల కథతో! - telugu news gossips on sharukh khan next movie
close
Published : 24/08/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస జీవితాల కథతో!

రాజ్‌కుమార్‌ హిరాణి, షారుక్‌ఖాన్‌ ఓ సినిమా చేస్తున్నారనే కబురు బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహం తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తిచేశారు. గతంలో రాసిన స్క్రిప్ట్‌లో ద్వితీయార్ధం ఆశించినంతగా లేకపోవడంతో... తిరగరాశారు. ఇప్పుడు కథనం సంతృప్తికరంగా వచ్చిందని హిరాణి బృందం తెలియజేసింది. ప్రస్తుతం ఈ బృందం నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టింది. కథానాయికగా తాప్సికి అవకాశం దక్కనుందని సమాచారం. షారుక్‌ఖాన్‌ పటాన్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ప్రాజెక్టు సెప్టెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. హిరాణి-షారుక్‌ కలయికలో సినిమా 2022 తొలినాళ్లలోనే మొదలవుతుందని తెలుస్తోంది. ఎక్కువ సన్నివేశాలు కెనడాలో చిత్రీకరించనున్నారు. సున్నితమైన హాస్యంతో పాటు...  ఏదో ఒక సందేశాన్ని తన చిత్రాల ద్వారా చెప్పే హిరాణి ఈ సారి వలస జీవితాల నేపథ్యంలో కథ తయారు చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని