AP NEWS: విజయవాడలో పీవీ సింధుకు ఘన స్వాగతం - telugu news grand welcome to pv sindhu in vijayawada
close
Published : 06/08/2021 01:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP NEWS: విజయవాడలో పీవీ సింధుకు ఘన స్వాగతం

విజయవాడ: విజయవాడ చేరుకున్న ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధుకు ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, అవంతి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ నివాస్‌ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పతకం తేవడం సంతోషంగా ఉందన్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అండగా ఉంటామని సీఎం జగన్‌ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. తనపై అభిమానం చూపిన వారికి పతకం అంకితమిస్తున్నానని సింధు చెప్పారు. తెలుగమ్మాయి ఒలింపిక్స్‌లో పతకం సాధించడం సంతోషంగా ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. యువత సింధును ఆదర్శంగా  తీసుకోవాలన్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని