కిషన్‌, షాను విస్మరించలేం: భజ్జీ - telugu news harbhajan singh talks of two youngsters hard to ignore in t20 world cup 2021
close
Published : 21/07/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కిషన్‌, షాను విస్మరించలేం: భజ్జీ

సూర్యకుమార్‌కు ప్రపంచకప్‌లో చోటు ఖాయమే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఇషాన్‌ కిషన్‌, పృథ్వీషాను విస్మరించలేమని టీమ్‌ఇండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అన్నాడు. వారిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు. 360 డిగ్రీల్లో ఆడే సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఖాయమేనని అంచనా వేశాడు. శ్రీలంకతో రెండో వన్డేకు ముందు భజ్జీ మీడియాతో మాట్లాడాడు.

‘ప్రదర్శనల ఆధారంగానే ఆటగాళ్లపై నిర్ణయం తీసుకుంటారు. అంతర్జాతీయ మ్యాచులో ఇషాన్‌ కిషన్‌, పృథ్వీ షా బ్యాటింగ్‌ చూస్తే వారి సామర్థ్యమేంటో అర్థమవుతుంది. టీ20 ప్రపంచకప్‌ జట్టులో వారిని విస్మరించలేం. మనం ప్రపంచకప్‌ గెలవాలంటే అలాంటి క్రికెటర్లే అవసరం. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరని వారు చూడరు. తమ సహజ ఆటతీరుకే ప్రాధాన్యమిస్తారు’ అని భజ్జీ అన్నాడు.

ముంబయి ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కూ ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయమే అంటున్నాడు భజ్జీ. ‘ఐసీసీ ప్రపంచకప్‌నకు ఈ కుర్రాళ్ల ప్రదర్శనను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా సీనియర్‌ ఆటగాడి స్థానం భర్తీ చేయాలన్నా సెలక్టర్లు వీరివైపే చూడాల్సి ఉంటుంది. నేనైతే సూర్యకుమార్‌ యాదవ్‌కు ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయమనే అనుకుంటున్నా. అతడు కేవలం దూకుడుగా ఆడటమే కాదు వికెట్‌నూ నిలుపుకొంటాడు. అదే సమయంలో వేగంగా పరుగులు చేస్తాడు’ అని తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని