Happy Birthday Pawankalyan: హరిహర వీరమల్లు.. అప్‌డేట్‌ అదుర్స్‌ - telugu news hariharaveera mallu update out now
close
Updated : 02/09/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Happy Birthday Pawankalyan: హరిహర వీరమల్లు.. అప్‌డేట్‌ అదుర్స్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ అభిమానులకు మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి పుట్టినరోజు కానుక విడుదలైంది. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని గురువారం మధ్యాహ్నం చిత్రబృందం ఈ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌ వజ్రాలదొంగ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్‌ అలరించనున్నారు. మొఘల్‌ సామ్రాజ్యం పాలన బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో ఔరంగజేబు చెల్లెలి పాత్రలో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారు. అలాగే, ఔరంగజేబు పాత్రలో అర్జున్‌ రాంపాల్‌ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన ‘భీమ్లానాయక్‌’ ఫస్ట్‌ సింగిల్‌ విశేషంగా అలరిస్తోన్న విషయం తెలిసిందే.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని