నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. రాత్రి 7గంటలకు గేట్లు ఎత్తివేత - telugu news heavy flood flow in srisailam dam
close
Published : 28/07/2021 17:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. రాత్రి 7గంటలకు గేట్లు ఎత్తివేత

శ్రీశైలం: శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ఈరోజు రాత్రి 7గంటలకు జలాశయం గేట్లను పైకెత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. మొదట ఒక గేటు ఎత్తనున్న అధికారులు క్రమంగా పదిగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.  2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్‌ సుధీర్‌బాబు తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల నుంచి 4.65 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.5 అడుగులకు చేరింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని