AP News: విస్తారంగా వర్షాలు.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద - telugu news heavy flood to srisailam dam
close
Updated : 24/07/2021 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: విస్తారంగా వర్షాలు.. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద

సున్నిపెంట సర్కిల్: ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 2,48,881 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి పోటెత్తుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 853 అడుగులకు నీరు చేరింది. దీని పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 86.8390 టీఎంసీలుగా నమోదైంది. నీటి లభ్యతతో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని