Dulquer Salmaan: సీతని పరిచయం చేసిన రామ్‌ - telugu news heroin conformed in dulquer salmaan film
close
Published : 01/08/2021 14:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Dulquer Salmaan: సీతని పరిచయం చేసిన రామ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో లెఫ్టినెంట్‌ రామ్‌ అనే పాత్ర పోషిస్తున్నాడు దుల్కర్‌. ఇప్పటి వరకు నాయిక వివరాల్ని చెప్పకుండా ఆసక్తి పెంచిన చిత్ర బృందం తాజాగా ఆ విషయాన్ని పంచుకుంది. బాలీవుడ్‌ భామ మృణాళ్‌ ఠాకూర్‌ ఈ చిత్రంలో నాయికగా ఎంపికైనట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది. నేడు మృణాళ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సీతగా సందడి చేయనుంది మృణాళ్‌. చీరకట్టులో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకుంటోందామె. ‘సూపర్‌ 30’, ‘లవ్‌ సోనియా’, ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’, ‘తుఫాన్‌’ తదితర హిందీ చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాళ్‌ తొలిసారి తెలుగు చిత్రంలో మెరవనుంది.

యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఇప్పటికే విడుదలై కొన్ని పోస్టర్లు, వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. వైజయంతీ మూవీస్‌ సంస్థ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌. వినోద్‌, కళ: వైష్ణవి రెడ్డి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. టైటిల్‌ని త్వరలోనే ప్రకటించనున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని