MahaSamudram: శర్వానంద్‌- సిద్ధార్థ్‌ కాంబో.. ‘తికమక మొదలే’ గీతం విన్నారా! - telugu news hey thikamaka song from mahasamudram sharwanand siddharth
close
Published : 30/09/2021 17:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MahaSamudram: శర్వానంద్‌- సిద్ధార్థ్‌ కాంబో.. ‘తికమక మొదలే’ గీతం విన్నారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్, సిద్ధార్థ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘మహా సముద్రం’. అను ఇమ్మాన్యుయేల్‌, అదితిరావు హైదరీ కథానాయికలు. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 14న  ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ‘హే తికమక మొదలే’ అనే గీతాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. కిట్టు విస్సాప్రగడ రచించిన ఈ పాట అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. చైతన్ భరద్వాజ్‌ స్వరాలు సమకూర్చారు. హరిచరణ్‌, నూతన మోహన్‌ ఆలపించారు. ఈ లిరికల్‌ వీడియోలో శర్వా- అను, సిద్ధు- అదితి జోడీగా కనిపించి అలరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ‘హే రంభ’ గీతం, ట్రైలర్‌ విశేషంగా అలరించాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని