టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత - telugu news high tension in proddutur
close
Updated : 27/07/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుపై వ్యతిరేకత.. ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

ప్రొద్దుటూరు పురపాలక: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు పురపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. స్థానిక డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో పోలీసులు ధర్నాను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, భాజపా నేతలు, కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ధర్నాను విరమించుకొని టిప్పు సుల్తాన్‌ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నించిన భాజపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో చాలాసేపు తోపులాట జరిగింది.

అనంతరం అక్కడే బైఠాయించిన భాజపా నేతలను ఆందోళన విరమించాలని డీఎస్పీ కోరారు. వారు ఒప్పుకోకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. మరోవైపు స్థానికంగా ఉన్న జిన్నా రోడ్డులో టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇటీవల భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని