AP Politics: నా రాజీనామా కోరడానికి అయ్యన్నపాత్రుడు ఎవరు?: సుచరిత - telugu news home minister sucharita comments
close
Updated : 18/09/2021 17:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP Politics: నా రాజీనామా కోరడానికి అయ్యన్నపాత్రుడు ఎవరు?: సుచరిత

తాడేపల్లి: ప్రజల తీర్పును తెదేపా నేతలు గౌరవించట్లేదని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్‌పై అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు సరిగా లేవని తెలిపారు. తాడేపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్న భాష ఏంటి. తెదేపా హయాంలోనే వంగవీటి రంగాను హత్య చేశారు. రంగాను హత్య చేసినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా?జగన్‌పై కోడి కత్తితో హత్యాయత్నం చేస్తే ఎగతాళి చేశారు. నా రాజీనామా కోరడానికి అయ్యన్న పాత్రుడు ఎవరు?సీఎం జగన్‌ ఆదేశిస్తే ఏ క్షణమైనా రాజీనామా చేస్తా.

మహిళా హోంమంత్రిపై అయ్యన్న వ్యాఖ్యలు శోచనీయం. ఆ వ్యాఖ్యలపై స్పందించకూడదని భావించా. ఆయన ఉపయోగించిన భాషను నేను వాడలేను. వైకాపాకు ప్రజా మద్దతు చూసి ఓర్వలేకే ఇటువంటి వ్యాఖ్యలు  చేస్తున్నారు. జోగి రమేశ్ కారు దిగకముందే దాడి జరిగింది. ప్రతిపక్ష నేతపై రమేశ్‌ దౌర్జన్యానికి వెళ్లలేదు. విజ్ఞాపన ఇవ్వడానికి సింగిల్‌గానే వెళ్తున్నారు. ఇప్పుడు అయ్యన్నపాత్రుడు తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు.

దళిత మహిళను హోంమంత్రిని చేస్తే మీకు ఎందుకు కడుపు మంట?దిశ చట్టంపై అభ్యంతరాలు ఉంటే ప్రశ్నించండి. గతంలో తెదేపా ప్రభుత్వం మహిళలకు ఏం న్యాయం చేసింది. చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలి. మహిళల గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మా పాలన నచ్చకపోతే ప్రజలే సమాధానం చెబుతారు. హోంమంత్రిపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. మహిళలంటే ఎలాంటి భావం ఉందో అర్థం అవుతోంది. ప్రజలు ప్రతి ఒక్కటి ఆలోచించే చేస్తారు’’ అని సుచరిత అన్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని