కుమార్తె మరణంతో షాకయ్యా: అన్నపూర్ణ - telugu-news-i was shocked with my daughter suicide says annapurna
close
Published : 14/07/2021 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుమార్తె మరణంతో షాకయ్యా: అన్నపూర్ణ

హైదరాబాద్‌: నటిగా, సహాయ నటిగా ఎన్నో సంవత్సరాల నుంచి వెండితెర వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్‌ నటి అన్నపూర్ణ. ప్రస్తుతం అమ్మ, బామ్మ పాత్రలు పోషిస్తున్న అన్నపూర్ణ... ఒకానొక సమయంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇష్టంగా పెంచుకున్న కుమార్తెను సైతం కోల్పోయారు. ఈ విషయంపై ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న కూతురు కన్నుమూయడంతో ఏం చేయాలో పాలుపోలేదని అన్నారు.

‘‘నా కాలంలో రోజులు వేరు కాబట్టి అప్పట్లో పరిస్థితుల దృష్ట్యా నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. నాకు పుట్టబోయే పిల్లల్ని పరిశ్రమలోకి తీసుకురావాలనుకోలేదు. ఆడపిల్ల ఉంటే ఇంటికి అందంగా ఉంటుందని భావించి తెలిసిన వాళ్ల దగ్గరి నుంచే ఓ పాపని దత్తత తీసుకున్నాను. తనని బాగా చదివించి ఓ వైద్యురాలిని చేయాలనుకున్నాను. కాకపోతే, తనకి చదువు సరిగ్గా రాలేదు. ఆ సమయంలో నేను పరిశ్రమలో నటిగా తీరిక లేకుండా ఉండేదాన్ని. దాంతో తనని కంటికిరెప్పలా కాపాడుకోవడం కష్టమయ్యేది. అందువల్లనే తన అంగీకారంతో ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను. తనకి ఓ పాప కూడా పుట్టింది. ఏం అయ్యిందో ఏమో తెలీదు. ఓరోజు ఉదయాన్నే ఆమె భర్త నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. తను ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ మాటతో నాకెంతో బాధగా అనిపించింది. ఆత్మహత్యకు కారణమేమిటో తెలియదు. మెట్టినింటి వాళ్లు ఏమైనా అన్నారో? లేకపోతే కట్నకానుకల విషయంలో భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు వచ్చాయో నాకు తెలీదు. ఎందుకంటే అత్తింటి వారి నుంచి ఇబ్బందులున్నాయని తను ఏ రోజూ నాకు చెప్పనేలేదు’’ అంటూ బాధను దిగమింగుతూ ఆ విషాద ఘట్టాన్ని అన్నపూర్ణ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని