Corona: 42 వేల కొత్త కేసులు.. కేరళలోనే 29 వేలకుపైగా - telugu news india corona bulletin
close
Updated : 05/09/2021 10:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: 42 వేల కొత్త కేసులు.. కేరళలోనే 29 వేలకుపైగా

దిల్లీ : దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా 40 వేలకుపైగానే కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 42 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 300 దాటింది.

కేరళలో తగ్గని ఉద్ధృతి..
ఇక కేరళలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా కేసులు ఆ రాష్ట్రం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఇక్కడ 29,682 కేసులు నమోదు కాగా.. 142 మరణాలు చోటుచేసుకున్నాయి.

* గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,47,476 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..42,766 కొత్త కేసులు బయటపడ్డాయి.

*కొవిడ్‌తో నిన్న 308 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,40,533కి చేరింది.

* తాజాగా 38,091 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,21,38,092కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.42 శాతంగా ఉంది.

* ఇక కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు కూడా 4 లక్షలకుపైనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 4,10,048(1.24 శాతం) యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

*దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 71,61,760 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 68,46,69,521కి చేరింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని