India corona: తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు.. - telugu news india corona update
close
Updated : 21/09/2021 10:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

India corona: తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు..

97.75 శాతానికి రికవరీ రేటు 

దిల్లీ: కొద్ది రోజులుగా 30 వేలకుపైనే నమోదవుతోన్న కరోనా కొత్త కేసులు నిన్న కాస్త తగ్గాయి. 13.6 శాతం మేర క్షీణించి.. 26 వేలకు పడిపోయాయి. అలాగే 200కు పైగా మరణాలు సంభవించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం, క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది.

సోమవారం దేశవ్యాప్తంగా 14,13,951 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..26,115 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.35 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు 3.27 కోట్ల మంది వైరస్‌ను జయించారు. 24 గంటల వ్యవధిలో 34 వేలమంది కోలుకున్నారు. ప్రస్తుతం 3.09 లక్షల క్రియాశీల కేసులున్నాయి. నిన్న 252 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 4.45లక్షలకు చేరింది. క్రియాశీల రేటు 0.92 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.75 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా.. ఒక్క కేరళలో నమోదవుతోన్న కేసులే రోజువారీ మొత్తం కేసులపై ప్రభావం చూపుతున్నాయి. ఆ రాష్ట్రంలో నిన్న 15వేల మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 2,583గా ఉంది.

ఇక భారత్‌లో టీకా కార్యక్రమం జెట్‌ స్పీడ్‌తో కొనసాగుతోంది. నిన్న 96,46,778 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 81.85 కోట్ల మార్కును దాటింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని