Vaccination: ఈ రోజు ఇప్పటికే కోటి డోసులు.. 2 కోట్ల దిశగా పయనం..! - telugu news india crosses vaccine milestone for fourth time in less than a month
close
Updated : 17/09/2021 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccination: ఈ రోజు ఇప్పటికే కోటి డోసులు.. 2 కోట్ల దిశగా పయనం..!

నిమిషానికి 42 వేల మందికి టీకా.. వెల్లడించిన అధికారులు

దిల్లీ: భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం నేడు దూసుకుపోతోంది. ఈ రోజు ఇప్పటికే కోటి డోసులు అందించి, రెండు కోట్ల మార్కు దిశగా పయనిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. టీకా వేయించుకొని ఆయనకు కానుక ఇవ్వాలని భాజపా నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీకా తీసుకొని, ఇతరులకు స్లాట్స్‌ బుక్‌ చేసి వ్యాక్సిన్ సేవ చేద్దామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా కోరారు. ఈ క్రమంలోనే టీకా పంపిణీ జోరుగా సాగుతోంది.

శుక్రవారం మధ్యాహ్నం కల్లా కోటి టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ లెక్కన నిమిషానికి 42 వేల మందికి టీకాలు వేసినట్లు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ ట్వీట్ చేశారు. అలాగే కోటి మార్కును దాటడం నెల వ్యవధిలో నాలుగోసారి కావడం గమనార్హం. మోదీ జన్మదినం సందర్భంగా ఈ రోజు రెండు కోట్ల మందికి టీకాలు ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అలాగే ఈ రోజు నుంచి 20 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు భాజపా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఆగస్టు 31న భారత్ అత్యధికంగా 1.30 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని