Tokyo Olympics: పురుషుల ఆర్చరీ.. కొరియా చేతిలో ఓటమి.. శరత్‌  కమల్‌ జోరు - telugu news india losses in archery quarter final against korea
close
Published : 26/07/2021 11:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: పురుషుల ఆర్చరీ.. కొరియా చేతిలో ఓటమి.. శరత్‌  కమల్‌ జోరు

టోక్యో: విలువిద్య బృంద పోటీల్లో భారత్‌ కథ ముగిసింది. పురుషుల బృంద పోటీల్లో అతాను దాస్‌, ప్రవీణ్‌ జాదవ్‌, తరుణ్‌దీప్‌ రాయ్‌తో కూడిన జట్టు వెనుదిరిగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌, బలమైన కొరియా చేతిలో 6-0 తేడాతో ఓటమి పాలైంది. టీమ్‌ఇండియా వరుసగా మూడు సెట్లలో తేలిపోవడం గమనార్హం.

ఈ పోటీల్లో ఒక్కో సెట్లో ఆరు బాణాలు గురి పెట్టాలి. ఒక జట్టులో ముగ్గురు ఆటగాళ్లు ఉంటారు కాబట్టి ఒకరి తర్వాత ఒకరు ఒక్కో బాణం రెండుసార్లు ఎక్కు పెట్టాలి. మొదటి సెట్లో భారత్‌ 54 మాత్రమే చేయగా కొరియా 59తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెట్లో టీమ్‌ఇండియా ప్రదర్శన  కాస్త మెరుగైంది. 57 స్కోర్‌ చేసింది. కానీ కొరియా మళ్లీ 59తో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కీలకమైన మూడో సెట్లోనూ 54 మాత్రమే చేయడం గమనార్హం. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ 56 స్కోర్‌ చేసి 6-0తో సెమీస్‌కు చేరుకుంది. ఇక భారత క్రీడాకారులు వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో ఏమైనా పతకాలు తెస్తారేమో చూడాలి!

శరత్‌ కమల్‌ జోరు

ఇక టేబుల్‌ టెన్నిస్‌లో భారత క్రీడాకారులు స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిస్తున్నారు. వెటరన్‌ ఆటగాడు శరత్‌ కమల్‌ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. పోర్చుగీస్‌కు చెందిన టియాగో పొలొనియాను 4-2 తేడాడో ఓడించాడు. తొలి గేమ్‌లో 2-11తో వెనకబడిన అతడు రెండో గేమ్‌ నుంచి పుంజుకున్నాడు. వరుసగా 11-8, 11-5, 9-11, 11-6, 11-9తో విజయం సాధించాడు. మహిళల వ్యక్తిగత పోటీల్లో సుతీర్థ ముఖర్జీ కథ ముగిసింది. రెండో రౌండ్లో పోర్చుగీస్‌ అమ్మాయి ఫు యు చేతిలో 0-4 తేడాతో ఓడింది. సుతీర్థ ఏ దశలోనూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించలేదు. వరుసగా 3-11, 3-11, 5-11, 5-11 తేడాతో ఓటమి పాలైంది. శరత్‌ కమల్‌ తన తర్వాతి మ్యాచులో మా లాంగ్‌తో తలపడనున్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని