IPL 2021: శుభ్‌మన్‌, నితీశ్‌ రాణా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తారు: డేవిడ్‌ హస్సీ - telugu news ipl 2021 david hussey feels shubhman gill and nitisha rana could shock the world
close
Published : 20/09/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL 2021: శుభ్‌మన్‌, నితీశ్‌ రాణా ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తారు: డేవిడ్‌ హస్సీ

ఇంటర్నెట్‌డెస్క్‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాళ్లు శుభ్‌మన్‌గిల్‌, నితీశ్‌ రాణా రాబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో అదరగొడతారని, తమ ఆటతో అందర్నీ షాక్‌కు గురిచేస్తారని ఆ జట్టు చీఫ్‌ మెంటార్‌ డేవిడ్ హస్సీ ధీమా వ్యక్తం చేశాడు. తొలి దశలో పేలవంగా ఆడి ఆకట్టుకోలేకపోయిన వీరు రెండో దశలో చెలరేగుతారని అన్నాడు. కోల్‌కతా సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో తలపడనున్న నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు.

‘వాళ్లిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లు. కోల్‌కతా జట్టు కోసం, తమ అంతర్జాతీయ కెరీర్ల కోసం అంకితభావంతో ఉన్నారు. రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో తమ ఆటతో అందర్నీ షాక్‌కు గురిచేసి టీమ్‌ఇండియ భవిష్యత్‌ తారలుగా నిలుస్తారు. అది కేవలం ఒకటి రెండు సిరీస్‌లకే కాకుండా దశాబ్దం పాటు రాణిస్తారు’ అని హస్సీ వివరించాడు. మరోవైపు తొలి దశలో ఆకట్టుకోలేని కోల్‌కతా కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ ఈసారి కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోవాలని ఆశిస్తున్నాడు. అతడు ముందుండి జట్టును నడిపించాలి. తన నుంచి భారీ ఇన్నింగ్స్‌ చూడాలి. తన ప్రణాళికలతో ఆకట్టుకోవాలి. తొలి దశలో విఫలమైనా ఇప్పుడు సరైన పంథాలో జట్టును ముందుకుతీసుకెళ్లాలి’ అని హస్సీ తన అభిప్రాయాలు వ్యక్తం చేశాడు.

మరోవైపు కోల్‌కతా ఇప్పుడు ఏడో స్థానంలో కొనసాగుతుండగా ఇప్పటికీ తమకు అవకాశాలున్నాయని అంటున్నాడు. ఇకపై ప్రతి మ్యాచ్‌ గెలిస్తే తప్పకుండా చరిత్ర సృష్టిస్తామన్నాడు. గతంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామని, దాంతో ఇప్పుడు కూడా అలాగే ముందుకు దూసుకెళ్తామని హస్సీ వివరించాడు. అందుకు అవసరమైన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారన్నాడు. ఈ క్రమంలోనే 2014లో కోల్‌కతా వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలుపొంది టైటిల్‌ సాధించినట్లు గుర్తుచేశాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని