IPL2021: విరాట్‌ కోహ్లీ.. ట్రోఫీ అందిస్తాడు: చాహల్‌ - telugu news ipl 2021 yuzuvendra chahal is full confident of virat kohli winning the trophy
close
Published : 21/09/2021 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL2021: విరాట్‌ కోహ్లీ.. ట్రోఫీ అందిస్తాడు: చాహల్‌

దిల్లీ: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌ కోహ్లి తొలి టైటిల్‌ అందిస్తాడనే నమ్మకం తనకుందని ఆ జట్టు స్పిన్నర్‌ చాహల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌గా తప్పుకుంటానని వెల్లడించిన కోహ్లి.. తాజాగా ఆర్‌సీబీ సారథిగా తనకిదే చివరి ఐపీఎల్‌ సీజన్‌ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆర్‌సీబీ ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదు.‘‘ఐపీఎల్‌-14 తిరిగి ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి టైటిల్‌ గెలిచేందుకు మాకు మంచి అవకాశాలున్నాయి. కోహ్లి ఈ సారి జట్టును ఛాంపియన్‌గా నిలుపుతాడనే నమ్మకంతో ఉన్నా’’ అని చాహల్‌ తెలిపాడు. కాగా, గతరాత్రి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు చిత్తుగా ఓడిపోయింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన నిర్ణీత ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. అనంతరం కోల్‌కతా ఒక్క వికెట్‌ నష్టపోయి 10 ఓవర్లలో సునాయాస విజయం సాధించింది. దీంతో బెంగళూరు ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని రెండో దశను ఓటమితో ఆరంభించింది. మరి చాహల్‌ అన్నట్లు ఆ జట్టు విజేతగా నిలుస్తుందా లేదా చూడాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని