Tuck Jagadish: ‘టక్‌ జగదీశ్‌’కు భారీ ఆఫర్‌.. థియేటర్లలోకి రానట్లేనా? - telugu news is this nani movie tuck jagadish release directly in ott
close
Published : 05/08/2021 13:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tuck Jagadish: ‘టక్‌ జగదీశ్‌’కు భారీ ఆఫర్‌.. థియేటర్లలోకి రానట్లేనా?

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథాచిత్రం ‘టక్‌ జగదీశ్‌’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. పూర్తిస్థాయి కమర్షియల్‌ హంగులతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 23న విడుదల చేయాలని చిత్రబృందం తొలుత భావించింది. అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదలను వాయిదా వేశారు. ఇప్పుడిప్పుడే థియేటర్లు పునఃప్రారంభం అవుతున్న తరుణంలో ‘టక్‌జగదీశ్‌’ రిలీజ్‌ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా విడుదలపై పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుందని సమాచారం. ఇందుకోసం చిత్రబృందానికి అమెజాన్‌ ప్రైమ్‌ భారీగానే డబ్బు చెల్లించిందట. అయితే, ఓటీటీ విడుదల విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

‘నిన్నుకోరి’ తర్వాత శివ-నాని కాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రమిది. రీతూవర్మ కథానాయిక. ఐశ్వర్యా రాజేశ్‌ రెండో కథానాయిక. జగపతిబాబు, నాజర్‌, రోహిణి, నరేశ్‌, రావు రమేష్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని