Tokyo Olympics: బ్లిచ్‌ఫెల్ట్‌తో పోరు సులువేం కాదన్న పీవీ సింధు - telugu news it is not easy to fight with bllichfeldt says pv sindhu
close
Published : 28/07/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: బ్లిచ్‌ఫెల్ట్‌తో పోరు సులువేం కాదన్న పీవీ సింధు

ఇంటర్నెట్‌ డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌ నాకౌట్‌ దశ సులభమేమీ కాదని భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు తెలిపింది. ప్రిక్వార్టర్స్‌లో బ్లిచ్‌ఫెల్ట్‌తో పోరు కఠినంగానే సాగుతుందని అంచనా వేసింది. రెండో రౌండ్‌ మ్యాచులో తన లయ అందుకున్నానని వెల్లడించింది. నాకౌట్లో అడుగుపెట్టిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. గ్రూప్‌ దశ రెండో మ్యాచులో హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ను ఆమె వరుస గేముల్లో ఓడించిన సంగతి తెలిసిందే.

‘రెండో గేమ్‌లో నా లయ అందుకున్నాను. మ్యాచును ముగించాను. ఆట వేగంగా సాగింది. నేను కొన్ని అనవసర తప్పిదాలు చేశాను. వ్యూహాలు మార్చి పరిస్థితులను నియంత్రించాను. పెద్ద మ్యాచులకు ముందు ఇలాంటి పరీక్షలు అత్యంత కీలకం’ అని సింధు తెలిపింది.

తర్వాతి మ్యాచులో తలపడే బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకు 4-1 ఆధిక్యం ఉంది. ఐతే ఆమెతో పోరు సులువు కాదని ఈ తెలుగుతేజం అంటోంది. ‘తొలి నాకౌట్‌ మ్యాచ్‌ అంత సులభమేమీ కాదు. త్వరగా కోలుకొని బలంగా పుంజుకోవాలి. నేనామెతో కొన్ని మ్యాచుల్లో తలపడ్డాను. ప్రతి పాయింటు ముఖ్యమే. ఆమె దూకుడుగా ఆడుతుంది. కాబట్టి నేనూ అలాగే ఆడాలి’ అని ఆమె వెల్లడించింది. క్వార్టర్స్‌లో అకానె యమగూచి, సెమీస్‌లో తైజు ఇంగ్‌తో సింధు తలపడాల్సి రావొచ్చు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని