Bigg boss Telugu 5: షణ్ముఖ్‌ ఏంట్రా ఇది.. ముద్దు పెట్టిన సిరి.. అగ్గిమీద గుగ్గిలమైన అనీ.. - telugu news jessie fires on sunny
close
Published : 28/10/2021 18:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg boss Telugu 5: షణ్ముఖ్‌ ఏంట్రా ఇది.. ముద్దు పెట్టిన సిరి.. అగ్గిమీద గుగ్గిలమైన అనీ..

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో షణ్ముఖ్‌-సిరిల మధ్య స్నేహం కొత్త బంధానికి బాటలు పరుస్తోందా? అంటే తాజా ప్రోమో చూస్తే అదేననిపిస్తోంది. ‘మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం’ అని షణ్ముఖ్‌ అంటే, ‘నీ వల్లే మెంటల్‌గా ఇబ్బంది పడుతున్నా’ అని సిరి-షణ్ముఖ్ మాట్లాడుకున్నారు. ‘అయితే దూరం పెట్టుకో’ అని షణ్ముఖ్ సలహా ఇస్తే, సిరి అతడికి ముద్దు ఇచ్చి వెళ్లిపోయింది. ‘ఏంట్రా ఇది.. అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది’ అని షణ్ముఖ్ ఆశ్చర్యపోతూ కనిపించాడు.  ఇక హౌస్‌లో(Bigg boss) కొత్త కెప్టెన్‌ను ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, అనీ, సన్నీ, మానస్‌లు పోటీలో విజయం సాధించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు బిగ్‌బాస్‌ ‘వెంటాడు వేటాడు’ అనే టాస్క్‌ ఇచ్చాడు. థర్మాకోల్‌తో నిండిన గోనె సంచులను కెప్టెన్సీ పోటీదారులకు ఇచ్చిన బిగ్‌బాస్‌.. బజర్‌ మోగేలోపు ఎవరి సంచిలో ఎక్కువ బాల్స్‌ ఉంటాయో వారే ఈ వారం కెప్టెన్‌ అవుతారని సూచించాడు. టాస్క్‌లో భాగంగా పోటీదారులు తమ ప్రత్యర్థుల సంచులను ఖాళీ చేయడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో పోటీదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది.

సన్నీ సంచిని ఖాళీ చేసేందుకు శ్రీరామ్‌ (Sriram) శ్రమించాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కిందపడిపోయారు. సన్నీ గీత అవతల పడిపోవటంతో సంచాలక్‌గా ఉన్న జెస్సీ అతడు గేమ్‌ నుంచి అవుట్‌ అయినట్లు ప్రకటించాడు. దీంతో కోపంతో ఊగిపోయిన సన్నీ ‘‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5 ఇంకా అయిపోలేదు. సన్నీ ఇక్కడే ఉంటాడు’’ అని కేకలు వేశాడు. అనంతరం, మానస్‌-శ్రీరామ్‌ల మధ్య జరిగిన పోరు రణరంగాన్ని తలపించింది. వాళ్లిద్దరూ కిందపడి మరీ ఒకరిపై ఒకరు విజయం సాధించడానికి ప్రయత్నిస్తుండటంతో ‘‘బిగ్‌బాస్‌ ఇచ్చిన రూల్స్‌ని అతిక్రమించారు. కాబట్టి వీళ్లిద్దరూ అవుట్‌’’ అని జెస్సీ చెప్పాడు. దాంతో మానస్‌కి సపోర్ట్‌గా ఉన్న సన్నీ మరోసారి కోపం ప్రదర్శించాడు. అక్కడే ఉన్న సంచిని సన్నీ కాలితో తన్నాడు. ‘‘కాలితో ఎందుకు కొడుతున్నావ్‌..?’’ అంటూ జెస్సీ కేకలు వేశాడు. మరి, ఈ హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధించారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే..!




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని