Jetty: ‘ఆశకంటే ఆశయం గొప్పది’.. బాలకృష్ణ మెచ్చిన ‘జెట్టి’ ట్రైలర్‌ చూశారా! - telugu news jetty trailer launch by balakrishna starring nandita swetha
close
Updated : 22/10/2021 04:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jetty: ‘ఆశకంటే ఆశయం గొప్పది’.. బాలకృష్ణ మెచ్చిన ‘జెట్టి’ ట్రైలర్‌ చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాన్యం కృష్ణ, నందిత శ్వేత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచుక (సుబ్బు) దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకారుల జీవన విధానాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ  ట్రైలర్‌ని గురువారం విడుదల చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

‘నా ఆశకంటే మా నాన్న ఆశయం గొప్పది సర్‌’ అని కథానాయిక చెప్పిన డైలాగ్‌తో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘జెట్టి’ కోసం రెండు వర్గాల మధ్య సాగే సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ‘మేం వెనకబడే ఉన్నాం. కానీ, వెన్నుపూస కూడా వెనకే ఉంటుంది సర్‌. ఎందుకో తెలుసా? మనిషిని నిలబెట్టడానికి, ముందుకు నడిపించడానికి’ అని కథానాయిక తండ్రి చెప్పిన ఈ సంభాషణ అందరినీ మెప్పించేలా ఉంది. మరి నందిత అనుకున్నట్టుగా తన తండ్రి ఆశయం నెరవేరుతుందా? అసలు ‘జెట్టి’ కథేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వర్థిన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. వేణు మాధవ్‌ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కార్తీక్‌ కొడకండ్ల సంగీతం అందించారు.



Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని