Jos Butller: నేనూ నా కుటుంబం క్రికెట్‌ కోసం ఎంతో త్యాగం చేశాం: బట్లర్ - telugu news jos buttler says he sacrificed alot for cricket commenting on ashes tour to australia
close
Published : 23/08/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Jos Butller: నేనూ నా కుటుంబం క్రికెట్‌ కోసం ఎంతో త్యాగం చేశాం: బట్లర్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే యాషెస్‌ సిరీస్‌కు వెళ్లాలా వద్దా అనే విషయంపై ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్ తర్జనభర్జన పడుతున్నాడు‌. ప్రస్తుతం కరోనా విషయంలో ఆస్ట్రేలియా కచ్చితమైన క్వారంటైన్‌, బయోబబుల్‌ నిబంధనలు పాటిస్తున్న నేపథ్యంలో కుటుంబంతో సహా అక్కడికి అనుమతిస్తారా లేదా చూడాలన్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల సుదీర్ఘ పర్యటనకు  వెళ్లడంపై బట్లర్‌ సంకోచిస్తున్నాడు. యాషెస్‌ సిరీస్‌ పర్యటనపై పూర్తి సమాచారం తెలియనంతవరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేనని చెప్పాడు.

అదే సమయంలో క్రికెట్‌ కోసం తానూ, తన భార్య లూయిస్‌ ఎంతో త్యాగం చేశామని పేర్కొన్నాడు. ప్రతి ఆటగాడు ఏదో ఒక సమయంలో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని, అప్పుడు కుటుంబమే ముఖ్యమని ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌ అభిప్రాయపడ్డాడు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయాలన్నాడు. అలాగే కొంత మంది ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవ్వడం కూడా బాధగా ఉంటుందన్నాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌ తర్వాత బట్లర్‌ ఐపీఎల్‌ ఆడాల్సి ఉంది. అయితే, అదే సమయంలో అతడి సతీమణి రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న పరిస్థితుల్లో మిగిలిన సీజన్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ గతరాత్రి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. మరోవైపు మేలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో తలపడిన మ్యాచ్‌లో బట్లర్‌ శతకంతో చెలరేగాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని