Ktr Birthday: కవితను కేటీఆర్‌ ఏమని పిలిచారంటే? - telugu-news-kalvakuntla kavitha birthday wishes to ktr
close
Published : 24/07/2021 19:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ktr Birthday: కవితను కేటీఆర్‌ ఏమని పిలిచారంటే?

హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరి, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా ఉంటూ మరిన్ని విజయాలను అందుకోవాలి’’ అని ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కవిత ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ పప్పు’’ అని రీట్వీట్‌ చేశారు.

మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును తెరాస శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పిలుపు మేరకు రాష్టవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటారు. వివిధ ప్రాంతాల్లో కేకులు కట్ చేసి... పాటల సీడీలు ఆవిష్కరించి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక, తదితర రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి కేటీఆర్‌కు ట్విటర్‌లో జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని